Skip to content
Advertisements

సిరుల పండగ సంతోషం నిండుగ

Pic by eenadu

ఇంటి ముంగిట రంగవల్లులు
బంతిపూల తోరణాలు
గాదెల నిండా ధాన్యపు రాశులు
పాలపొంగళ్ల ఘుమఘుమలు
గంగిరెద్దుల గంటల చప్పుళ్లు
ఆకాశంలో ఇంధ్రధనుస్సుతో పోటీపడే పతంగులు
కొత్త అల్లుళ్లు.. కొంటె మరదళ్లు కలసి చేసే సందళ్లు
ఊరంతా ఉత్సాహం
అందరిలోనూ ఉప్పొంగే ఉల్లాసం…

తెలుగింటి సంక్రాంతి శోభ  వచ్చిందనడానికి ఇదే తార్కాణం. ఈ సందడంటే తెలుగు సినిమాకి ఎంతిష్టమో! అందుకే వీలు కుదిరినప్పుడంతా తెరపై  చోటిస్తుంటుంది. సినిమాకీ, సంక్రాంతి పండగకీ  విడదీయలేని అనుబంధం ఉంది. కొత్త సినిమాతోనే సంక్రాంతి పండగ పరిపూర్ణమైనట్లు భావిస్తుంటారు తెలుగువాళ్లు. మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరస కడుతుంటాయంటే కారణం అదే. పది రోజుల ముందే చిత్ర పరిశ్రమకి సంక్రాంతి కళ వచ్చేస్తుంటుంది. ఈసారి కూడా అంతే. అయితే సినిమాల హంగామా ఎంతున్నా తారలు ఈ పండగని కుటుంబంతో కలసి సరదాగా జరుపుకొంటుంటారు. సంక్రాంతి పండగ ఎంత ప్రత్యేకమో మన తారలు చెబుతున్నారిలా…

Pic by eenadu

‘‘చిన్నప్పుడు మద్రాసులో సంక్రాంతి జరుపుకొన్న రోజులు బాగా గుర్తుకొస్తుంటాయి. అక్కడ భోగి బాగా చేసేవాళ్లు. పొద్దున్నే భోగి మంటలు వేసుకోవడం, రకరకాల పిండి వంటలు సిద్ధం చేయడం చాలా బాగా  అనిపించేది. ఈ పండగ రోజున అందరూ కలసి భోంచేసేవాళ్లం. ఇలా అందరినీ కలిపే పండగలు తక్కువగా వస్తుంటాయి. హైదరాబాద్‌ వచ్చాకైతే పతంగులు ఎగరేయడం ఎక్కువగా  కనిపించింది. ఒక సినిమావాడిగానూ, ప్రేక్షకుడిగానూ ఈ పండగ వస్తోందంటే కొత్త సినిమాలు ఏం విడుదలవుతాయా అని ఆలోచిస్తుంటాం.  సినిమాలకీ, సంక్రాంతికీ అంత అనుబంధం.  సినిమాలకి వెళ్లాలన్న ఆసక్తి ఎప్పుడో కానీ రావడం లేదు. సంక్రాంతి అలా కాదు, సరదాగా థియేటర్‌కి వెళ్లి కొత్త సినిమాని చూసొద్దామనే కోరిక పుట్టిస్తుంటుంది. అందుకే సంక్రాంతి అనగానే కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. నా కెరీర్‌లో సంక్రాంతికి  వచ్చిన సినిమాలు బాగా ఆడాయి. ‘ఎఫ్‌2’తో సంక్రాంతి అల్లుడిగానూ సం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: