Skip to content
Advertisements

అనుష్కతో హాలీవుడ్‌ స్టార్‌?

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క తన తర్వాతి సినిమాకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత, రచయిత కోన వెంకట్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మాడ్సన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ఈ ప్రాజెక్టును ఉద్దేశించి కోన ఓ పోస్ట్‌ చేశారు. సినిమాలో అనుష్క లుక్‌ అద్భుతంగా ఉంటుందని, ఇది ఆమె సినీ కెరీర్‌లోనే ది బెస్ట్‌ లుక్‌ కాబోతోందని అన్నారు.

ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నారట. థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీ మోహన్‌, కోన సినిమా కథ రాశారు. ఈ కథ కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డట్లు ఇటీవల ఓ ఆంగ్లపత్రికతో కోన అన్నారు. అంతేకాదు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చెబుతున్నారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోందట. దాదాపు సినిమా షూటింగ్‌ అమెరికాలో జరగనున్నట్లు తెలిసింది.

Pic by Eenadu

By Eenadu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: