Skip to content
Advertisements

ఎయిర్‌ ట్యాక్సీలు ఎప్పుడంటే.. ప్రకటించిన తయారీ సంస్థ

ఇంటర్నెట్‌డెస్క్‌: రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో రోడ్డు మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకోవడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా రాజధాని నగరాల్లో నివసించేవారికి ఆ కష్టం ప్రతి రోజూ అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం.. రద్దీ కారణంగా గంటలు పడుతుంది. అంతర్జాతీయంగా న్యూయర్క్‌, లాస్‌ఏంజెల్స్‌, హోస్టన్‌, అట్లాంటా వంటి నగరాల్లో వాహన రద్దీ అత్యధికంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా.. మెట్రో రైలు వంటి ప్రాజెక్టులు కొన్ని నగరాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఈ మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదే కాక, కొంత ప్రయాస కూడా. అన్ని ప్రదేశాలకు అనుసంధానమై ఉండే అవకాశం లేకపోవడమూ మరో ప్రతికూలాంశంగా పేర్కొనవచ్చు. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా కొన్నేళ్ల క్రితం ‘ఎయిర్‌ ట్యాక్సీ’ అనే రవాణా వ్యవస్థ గురించి వార్తలొచ్చాయి. ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా ఈ ట్యాక్సీలు గాలిలో ప్రయాణించడం వల్ల.. సమయం బాగా ఆదా అవుతుంది. ఎయిర్‌ట్యాక్సీలను హెలికాప్టర్లకు హైబ్రీడ్‌ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు.

అయితే ఈ ఎయిర్‌ట్యాక్సీలను బెల్‌ నెక్సస్‌ అనే సంస్థ తయారు చేస్తోంది. దీనికి ఊబర్‌ సంస్థ అనధికార భాగస్వామి. ఈ ఏడాది లాస్‌ ఏంజిల్స్‌లో జనవరి 8 నుంచి 11 వరకూ జరుగుతున్న సీఈఎస్‌ సాంకేతిక ప్రదర్శనలో భాగంగా సంస్థ ఈ వాహన నమూనాను ‘అర్బన్‌ ఎయిర్‌ మొబిలిటీ వెహికిల్‌’ పేరుతో ఆవిష్కరించారు. ఈ ఎయిర్‌ ట్యాక్సీలను 2020ల్లో అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు బెల్‌ నెక్సస్‌ సంస్థ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు రాబర్ట్‌ హాస్టింగ్స్‌ వెల్లడించారు. ఈ రంగంలో ప్రస్తుతం తాము అనుసరిస్తున్న టెక్నాలజీ మరీ అంత కఠినమేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్‌ ట్యాక్సీలకు హైబ్రీడ్‌ విద్యుత్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థతో ఆరు ఫ్యాన్లు ఉంటాయి. ఎయిర్‌ ట్యాక్సీ ఎగరడం, దిగడం, వివిధ కోణాల్లో ముందుకు పోవడం, వేగాన్ని నియంత్రించడంలో ఈ వ్యవస్థే కీలకం కానుంది. వాహనం బరువు 6 వేల పౌండ్లు (2,721 కిలోలు). ఎగిరేటప్పుడు దుమ్ము, వర్షం వంటి పరిస్థితులకు తట్టుకొని ఉండగలదు. పక్షులు ఎదురైనా ప్రమాదమేమీ ఉండబోదు. ఈ ట్యాక్సీలు నిట్ట నిలువుగా ఎగరడం, దిగడం కోసం దీనిపై నాలుగేళ్లుగా దృష్టి సారించాం’’ అని హాస్టింగ్స్‌ వెల్లడించారు.

By eenadu

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: