Skip to content
Advertisements

మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

  • సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్ లు – గులాబీలు ఇవ్వడం, లవ్ గ్రీటింగులు ఇవ్వడం ఇలా రకరకాల మార్గాలను ఉపయోగిస్తుంటారు. కానీ నేరుగా చెప్పడానికి కొంత భయానికి లోనవుతుంటారు.కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలకు తమలో వున్న ప్రేమానుభావాలను వ్యక్తపరచడానికి ఎవ్వరు అనుసరించని ప్రత్యేక పద్ధతులను అనుసరించడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది సినిమాలలో వుండే హీరోలులాగా డైలాగులు చెప్పడం, లేదా దుస్తులను ధరించి అమ్మాయిని ప్రపోజ్ చేయడం చేస్తుంటారు. మరికొంతమంది ఎవ్వరూ చేయని పిచ్చిపిచ్చి పద్ధతులతో విసుగు తెప్పిస్తుంటారు. కాబట్టి ఎప్పటికీ ఇలా చేయకుండా మీకు మీరుగానే వుండేందుకు ప్రయత్నించండి.సాధారణంగా అబ్బాయిలందరూ తనకు నచ్చిన అమ్మాయిని ప్రపోజ్ ఎలా చేయాలా అన్న ఆలోచనలోనే కాలాన్ని వృధా చేస్తుంటారు. ఇలా చేస్తే ఏ ప్రయోజనం దక్కదు. మీకు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించాలంటే.. మీరు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి కూడా తెలిసేలా చేయాలి. అప్పుడే ఏదైనా ఒక రిజల్ట్ బయటపడుతుంది. అలా అని నేరుగా వెళ్లి ‘‘ఐ లవ్ యూ’’ అని కూడా చెప్పకూడదు. తను కూడా మీమీద చొరవ చూపించినట్లయితే మీ భావాలను వ్యక్తపరచడానికి ఆస్కారం వుంటుంది.

మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు :

1. ముందుగా మీకు నచ్చిన అమ్మాయికి మీ మనసులోని భావాలను వ్యక్తపరిచేముందు తన మనసులో కూడా ఎవరైన వున్నారా..? లేదా..? అన్న వాటి గురించి తెలుసుకుంటే చాలా మంచిది. అప్పుడు దానికి తగిన కొన్ని పరిష్కార మార్గాలను వెదుక్కోవచ్చు.

2. నచ్చిన అమ్మాయిని నేరుగా వెళ్లి ఐ లవ్ యూ ఎప్పుడూ చెప్పకూడదు. అలా చేస్తే ఆమె మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా ట్రీట్ చేసి, చెంప ఛెళ్లుమని పగలగొట్టచ్చు.

3. మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ఏం చేస్తోంది.. ఏం ఇష్టపడుతుంది.. ఎటువంటి వస్తువులు తనకు ఇష్టమోనన్న అంశాల గురించి ముందు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే అమ్మాయికి సమయానుకూలంగా అటువంటి వస్తువులను తెచ్చిస్తే వారు ఎంతగానో సంతోషపడతారు. మీ మీద ఆమెకు ఒక నమ్మకం కలుగుతుంది కూడా.

4. తను ఏదైనా ఒక సమస్యలో వుండి, బాధపడుతుంటే.. మీరు ఆమెకు తోడుగా వుండాలి. అన్నివిధాలుగా సహాయం చేస్తే మీమీద ఆమె ఒక గౌరవం ఏర్పడుతుంది. అన్నివిధాలుగా తను కూడా మీకు సహకరిస్తుంది.

5. మీకు నచ్చే ప్రతి చిన్న విషయాన్ని మీ ప్రియురాలితో పంచుకుంటూ తను కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీ భావనలకు తగ్గట్టుగానే తనుకూడా మీతో నడుచుకుంటుంది. ప్రియురాలితో ప్రతి ఒక విషయాన్ని స్వేచ్ఛగా చెప్పుకుంటే.. మీలో వున్న భావనలను ఆమె కూడా సులభంగా అర్థం చేసుకుంటుంది.

6. ప్రియురాలికోసం అనవసరమైన ఖర్చులు వెచ్చించకుండా, పిచ్చిపిచ్చి చేష్టలు చేయకుండా మీకు మీరుగానే వుండండి. అప్పుడే ఆ అమ్మాయి కూడా మీలో వున్న నిజాన్ని, గుణాలను గుర్తిస్తుంది. దాంతో ఆ అమ్మాయి మనసులో మీమీద కూడా ప్రేమానుభవాలు కలిగే అవకాశం వుంది.

7. మీ ప్రియురాలి మీపట్ల ఆసక్తికరంగా వుంటూ.. మీరు చెప్పినట్లుగా నడుచుకుంటే తను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు కిందే వస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటివారు తమను ప్రేమిస్తున్నారనే అంశాన్ని అమ్మాయి గ్రహిస్తే.. కొద్దిరోజుల తరువాత వారే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మీతో ఎలా ప్రవర్తించాలోనన్న ఒక అవగాహనకు వారు వచ్చేస్తారు.

8. ప్రియురాలు తన మనసులో వున్న భావాలను నేరుగా కాకుండా మీనుంచే చెప్పించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి సమయాల్లో మీరు కూడా ఒక గులాబీ ఇచ్చి ఆమెకు మీ మనసులోని భావాలు వ్యక్తపరిస్తే చాలు.. తను మీ ప్రేమను అంగీకరించడానికి ఎంతో వీలుగా వుంటుంది.

Advertisements

1 Comment »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: